ETV Bharat / state

'దళిత కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేయడం దారుణం' - గుమ్మలపాడులో దళిత కుటుంబాలు వార్తలు

దళిత కుటుంబాలను బహిష్కరణ జరిగిన విశాఖ జిల్లా గుమ్మలపాడులో సబ్​కలెక్టర్ సందర్శించారు. బాధితులనుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Deportation of Dalit families at gummalapadu
దళిత కుటుంబాల బహిష్కరణ
author img

By

Published : Sep 28, 2020, 11:59 PM IST

దళితులపై దురాగతాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ అన్నారు. రావికమతం మండలం గుమ్మలపాడు గ్రామాన్ని సందర్శించారు. దళిత కుటుంబాల బహిష్కరణకు సంబంధించిన ఘటనపై విచారణ చేపట్టారు. అక్కడి పరిస్థితులపై గ్రామస్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

దళిత సామాజిక వర్గానికి చెందిన యువతిని అగ్రవర్ణానికి చెందిన యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని.... దళిత కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేయడం దారుణమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించడం జరుగుతుందని అన్నారు. ఈ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సంబంధిత కుటుంబాల వారికి కౌన్సిలింగ్ చేయాల్సిందిగా మండలస్థాయి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇటువంటి సంఘటనలు సబ్ డివిజన్ లో ఎక్కడ పునరావృతం కాకూడదని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రావికమతం మండలం తహసీల్దార్ కనకారావు, కొత్తకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మణమూర్తి, రావికమతం ఎస్ఐ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

"కుమారస్వామి ఆలయ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలి"

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.