విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో దసరా ఉత్సవాలు మొదలయ్యాయి. క్షేత్రపాలకుడైన త్రిపురాంతక స్వామి ఆలయంలో అమ్మవారు రోజుకో అలంకరణతో భక్తులకు దర్శనమివ్వనున్నారని ఆలయ అర్చకులు తెలిపారు. నవరాత్రిలో భాగంగా రోజూ ప్రత్యేక పూజలు జరుగుతాయని చెప్పారు.
విజయదశమి నాడు సింహగిరిపై మహోత్సవం జరిపిస్తామని పూజారులు ప్రకటించారు. ఏటా ఉత్సవం కొండ దిగువున పూల తోటలో జరిగేదని.. కరోనా కారణంగా ఈ సంవత్సరం స్వామి సన్నిధానంలో జరుగుతుందన్నారు. కొవిడ్ నిబంధనలతో కొంతమంది భక్తులకు మాత్రమే దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: దుర్గామల్లేశ్వర ఆలయంలో మొదలైన శరన్నవరాత్రుల శోభ