విశాఖలో "మీతో నేను" ఆత్మకథ పుస్తకావిష్కరణ - meetho nenu book news
విశాఖ పట్టణంలో హ్యాపీ ఫంక్షన్ హాల్ వేదికగా విశాఖ గౌరీ సేవ సంఘం సమావేశం జరిగింది. రాష్ట్ర గౌరీ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఈసీఐఎల్ విశ్రాంత ఉన్నత ఉద్యోగి దాడి అప్పారావు అష్టదశ జన్మదినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రచించిన "మీతో నేను" అనే పేరిట ఆత్మకథ పుస్తకాన్ని రాజకీయ ప్రముఖులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీవీజీ గణబాబు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ్ ప్రసాద్‌లు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతంలో పుట్టి...గౌరీ సేవ సంఘం ఏర్పాటు చేసి ఎన్నో సేవలు అందించిన దాడి అప్పారావు అందరికి ఆదర్శనీయమని పలువురు అభిప్రయపడ్డారు.