అపరిచిత వ్యక్తులు ఆన్‌లైన్ ద్వారా రూ.2.20 లక్షలకు టోకరా వేశారు విశాఖలోని కూర్మన్నపాలెంలో నివాసం ఉంటున్న పి.అప్పలనాగేశ్వరరావు ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకునిగా పని చేస్తున్నారు ఆయన చరవాణికి మూడు రోజుల క్రితం 98328 38143 నంబరు నుంచి ఓ సంక్షిప్త సందేశం వచ్చింది. మీ ఫోన్‌లోని పేటీఎం యాప్‌లో సాంకేతిక సమస్య ఉందని అందులో పేర్కొన్నారు. దీంతో కంగారు పడిన నాగేశ్వరరావు తిరిగి అదే నంబరుకు ఫోన్ చేశారు. అవతలి వ్యక్తి సూచనల మేరకు సిమ్ తీసి వేరే ఫోన్‌లో వేసి, కేవైసీ అప్‌డేట్ కోసం ‘క్విక్ సపోర్టు, ఎస్‌ఎంఎస్ టూ ఫోన్’ అనే రెండు యాప్‌లు డౌన్‌లోడ్ చేశారు. ఆ తరవాత ఆయన తన ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు నుంచి రూ.5, రూ.10 చొప్పున తన సొంత సేవింగ్స్ ఖాతాకు బదిలీ చేసి తనిఖీ చేసుకున్నారు. వెనువెంటనే 2, 3 నిమిషాల వ్యవధిలోనే తన ఖాతా నుంచి రూ.2,20,604 అపరిచిత వ్యక్తుల ఖాతాకు బదిలీ అయ్యాయి. దీంతో బాధితుడు ఆదివారం విశాఖ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.సైబర్ క్రైమ్ సీఐ చౌదరి, ఎస్‌ఐ మనోహరనాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి. భవన నిర్మాణాల్లో ఈసీబీసీ అమలుచేయాలి