ETV Bharat / state

CISF constable in Pakistani woman honeytrap పాక్‌ మహిళ హనీట్రాప్‌‌లో సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌.. వీడియోకాల్​తో మొదలు పెట్టి - CISF constable in Pakistani woman honeytrap

CISF constable in Pakistani woman honeytrap పాకిస్థాన్‌‌కు చెందిన ఓ మహిళ హనీట్రాప్‌లో పడిన సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌‌‌పై విశాఖ సిటీ కమిషనర్ త్రివిక్రమవర్మ ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు వెల్లడించారు.

honeytrap
honeytrap
author img

By

Published : Aug 7, 2023, 10:29 PM IST

Updated : Aug 7, 2023, 10:52 PM IST

CISF constable in Pakistani woman honeytrap సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌‌గా విధులు నిర్వర్తిసున్న ఓ అధికారి.. పాకిస్థాన్‌‌కు చెందిన ఓ మహిళ హనీట్రాప్‌లో పడ్డాడు. న్యూడ్ వీడియో కాల్స్‌తో మొదలైన వారి పరిచయం.. ఓ గదిలో రహస్యంగా కలిసేంత వరకు వెళ్లింది. ఆ తర్వాత ఆ అధికారి (సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌) ఆ మహిళ ద్వారా పాకిస్థానీ గూఢాచార సంస్థకు దేశ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తున్నట్లుగా అధికారులు అనుమానించారు. అతనిపై కేసు నమోదు చేసి మొబైల్ ఫోన్లు తనిఖీ చేయగా.. పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లుగా వెల్లడించారు.

విశాఖలో హనీట్రాప్ కలకలం.. విశాఖపట్నం జిల్లాలో మరో హనీట్రాప్ కలకలం రేపింది. యువతలతో గాలం వేసి.. భారత దేశ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్థానీ గూఢాచార సంస్థ చేజిక్కించుకుంటోంది. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీ విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కపిల్ కుమార్, జగదీష్ బాయ్ మురారి చిక్కుకున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమీషా అనే పాకిస్థానీతో ఆయనకి పరిచయం ఏర్పడింది. అతడి కదలికలపై అనుమానంతో "రా" ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. రహస్య సమాచారం చేరేవేశారన్న అనుమానాలకు బలం చేకూర్చేలా ఆధారాలు కొన్ని ప్రాథమిక విచార వెలుగులోకి వచ్చాయి. వీటి ఆధారంగా కపిల్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Honey Trap: ఆన్​లైన్​లో 'వలపు వల'.. ఉద్యోగులకు హెచ్చరికలు!

వీడియో కాల్స్‌తో మొదలైన పరిచయం.. గుజరాత్‌కి చెందిన కపిల్ కుమార్ తొలుత హైదరాబాద్‌లోని 'భారత్ డైనమిక్స్ లిమిటెడ్'లో విధులు నిర్వహించారు. ఆ తర్వాత 2022 ఆగస్టు 2 నుంచి బదిలీపై వచ్చి విశాఖ స్టీల్ ప్లాంటు సెక్యూరిటీలో చేరారు. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ (C.I.S.F.) ఫైర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కపిల్‌కి రెండేళ్ల క్రితమే తమీషా అనే మహిళ ఫేస్‌బుక్‌ ద్వారా పరిచమైంది. ఆ పరిచయం న్యూడ్ వీడియో కాల్స్‌తో మొదలై.. హైదరాబాద్‌లోని ఓ గదిలో రహస్యంగా కలిసేంత వరకు వెళ్లిందని సమాచారం. ఆమె ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన పెద్ద నాయకుడి వద్ద వ్యక్తిగత సహాయకురాలిగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. గత రెండేళ్లుగా కపిల్ నుంచి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ భద్రతకు, స్టీల్ ప్లాంటు రహస్య సమాచారం బయటకు వెళ్లినట్లు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు.

Honey trap: కిలాడీ కపుల్​.. హనీట్రాప్​తో 300 మందికి టోకరా!

ఫోన్లు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన అధికారులు.. వివాహమైనప్పటికీ కపిల్ ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ బ్యారెక్స్‌లో ఒక్కరే నివాసం ఉంటున్నారు. గత కొంత కాలంగా సోషల్ మీడియా ద్వారా పాకిస్థాన్‌కి రహస్య సమాచారం చేరవేస్తున్నారని.. కేంద్ర నిఘా సంస్థలకు తెలిసింది. ఈ క్రమంలో మొబైల్ నెంబర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారన్న ఆధారంగా కపిల్ ఫోన్లు తీసుకుని పరిశీలించగా.. తమీషా పేరుతో నెంబరు సేవ్ చేసినట్లు గుర్తించారు. ఈ నెల 1వ తేదీన కపిల్ వద్ద రెండు సెల్‌ఫోన్లు మాత్రమే గుర్తించగా.. 4వ తేదీ మరో ఆండ్రాయిడ్ ఫోన్ వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ మూడు చరవాణిల్లోని సామాజిక మాధ్యమ యాప్‌లలో మెసేజ్‌లు డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్లు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. విశాఖ సిటీ కమిషనర్ త్రివిక్రమవర్మ ఆదేశాలతో అధికార రహస్యాల ఉల్లంఘన నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

14 మందిని అరెస్టు చేసిన అధికారులు.. విశాఖలోని నేవీలో గూఢచర్యం కేసును ఎన్.ఎస్.ఐ.ఏ (N.S.I.A.) "ఆపరేషన్ డాల్ఫిన్ నోస్' పేరుతో గతంలో చేధించింది. సోషల్ మీడియా ద్వారా పాకిస్థానీ అమ్మాయిల పేరుతో విశాఖ నేవీ దళ సభ్యులకు ఎరవేసి, నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములకు సంబంధించిన రహస్య సమాచారం తెలుసుకునేందుకు కుట్ర పన్నారని అప్పట్లో సంచలనమైంది. ఈ క్రమంలో 11 మంది నేవీ అధికారులతో సహా, మొత్తం 14 మందిని అరెస్టు చేశారు. అదే కేసులో ఈ ఏడాది జులై 19న నేవల్ డాక్ యార్డులో ఈఏసీగా పని చేసిన ఆకాష్ సోలంకితోపాటు, అనుమానిత పాకిస్థాన్ వ్యక్తిపై చార్జిషీట్ దాఖలైంది. ఈ రాకెట్లో కీలక డాక్యుమెంటు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు స్వాధీనం చేసుకుని, అధికారులకు డబ్బులు చేరినట్లు వెలుగు చూపాయి. ఇప్పుడు తాజాగా హనీట్రాప్ కేసులో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Honey trap in AP: మత్తుగా మాట్లాడి.. మెుత్తం లాగేసుకోవాలనుకుంది..

Last Updated : Aug 7, 2023, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.