ETV Bharat / state

ప్రభుత్వం ఇసుకని అందుబాటులో ఉంచాలి: క్రెడాయ్ - క్రెడాయ్ పై వార్తలు

కరోనా ప్రభావంతో నష్టపోయిన రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని క్రెడాయ్ ఛైర్మన్‌ కోటేశ్వరరావు కోరారు. ఇసుకను అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. అపార్టుమెంట్‌ ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్లను 2 శాతానికి తగ్గించాలని ఆయన కోరారు.

credai on sand problem
క్రెడాయ్
author img

By

Published : Jul 28, 2020, 12:16 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను అందుబాటులో ఉంచాలని క్రెడాయ్‌ (కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా) ఛైర్మన్‌ కోటేశ్వరరావు కోరారు. కరోనా కారణంగా రియల్‌ ఎస్టేట్‌ రంగం తీవ్రంగా నష్టపోయిందని ఆయన అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం టన్ను ఇసుక రూ.375గా నిర్ణయించినా, ప్రభుత్వశాఖల మధ్య సమన్వయ లోపంతో రూ.1700 నుంచి రూ.2వేల వరకు చెల్లించాల్సి వస్తోందన్నారు.

ఇసుక, ఇతర నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో అపార్టుమెంట్లలో ఫ్లాట్లలకు యూనిట్‌ ధర రూ.150 వరకు అధికంగా అవుతోందన్నారు. వెబ్‌పోర్టల్‌లో అనుమతుల కోసం తీవ్ర జాప్యం కలుగుతోందని, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఇసుక తీసుకొస్తుండటంతో రవాణా ఖర్చులు భారీగా పెరుగుతున్నాయన్నారు.

అపార్టుమెంట్‌ ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్లను 2 శాతానికి తగ్గించాలని కోరారు. క్రెడాయ్‌ ఉపాధ్యక్షుడు అశోక్‌కుమార్‌, సభ్యులు సీహెచ్‌ గోవిందరాజు, శ్రీనివాస్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 670 మంది ఆర్టీసీ సిబ్బందికి కరోనా పాజిటివ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.