ETV Bharat / state

ఎల్​జీ పాలిమర్స్​కు వ్యతిరేకంగా సీపీఎం ఆందోళన - vishaka latest news

గ్యాస్​ లీకేజీ ఘటనకు కారణమైన ఎల్​జీ పాలిమర్స్​ను విశాఖ నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, సీఐటీయూ ఆందోళన చేపట్టాయి. పోలీసులు వారి ఆందోళనను అడ్డుకున్నారు. కొందరు నేతలను గృహ నిర్బంధం చేశారు.

cpm protest against lg polymers in vishaka

author img

By

Published : Jun 5, 2020, 12:56 PM IST

ఎల్​జీ పాలిమర్స్​కు వ్యతిరేకంగా సీపీఎం ఆందోళన

పర్యావరణానికి హాని కలగించే ఎల్​జీ పాలిమర్స్ పరిశ్రమను తరలించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో సీపీఎం, సీఐటీయూ, ఇతర ప్రజాసంఘాలు నిరసన చేపట్టాయి. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోపాలపట్నం పెట్రోల్ బంకు నుంచి మానవహారానికి వామపక్షాలు పిలుపునివ్వటంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. వామపక్ష నాయకులని ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. సీపీఎం కార్యాలయాలు, పార్టీ నాయకుల ఇళ్ల వద్ద పోలీస్ నిఘా ఏర్పాటు చేశారు. అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ పోలీసుల తీరుపై సీపీఎం నేత గంగారావు మండిపడ్డారు. అరెస్టుల ద్వారా ప్రభుత్వం ఉద్యమాన్ని ఆపలేదన్నారు.

ఇదీ చదవండి

ఏడాదిలో ఎంపీల పనితీరిది... ప్రథమం, అథమం ఎవరంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.