విజయ పాల ధరల పెంపును నిరసిస్తూ.. సీపీఎం ఆధ్వర్యంలో విజయవాడ మిల్క్ యునియన్ ప్రాజెక్టు వద్ద నిరసన చేపట్టారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సింది పోయి.. ఇలా ధరలు పెంచి సామాన్య, మధ్య తరగతి వర్గాలకు భారం పెంచారని.. సీపీఎం నేత బోయ సత్తిబాబు ఆగ్రహించారు. పాల ధరలను నియంత్రించకపోతే.. రాబోయే రోజుల్లో పార్టీ తరపున పెద్దఎత్తున నిరనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇదీ చదవండి: