విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దోబూచులాడుతోందని కృష్ణాజిల్లా సీపీఐ కార్యదర్శి అక్కినేని వనజ అన్నారు. కేంద్రంతో రహస్య ఒప్పందాలు చేసుకుని.. ఏమీ తెలియనట్లు పాదయాత్రలు చేస్తామని చెప్పడం నమ్మశక్యంగా లేదని ఆరోపించారు. విజయవాడ దాసరి భవన్లో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ఈ నెల 5వ తేదీన రాష్ట్రబంద్‌కు పిలుపునిస్తున్నామని తెలిపారు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కదలి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం బంద్‌కి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు.
ఇదీ చదవండి: 'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపివేయాలి'