విశాఖలో మొదటి దశ పంచాయతి ఎన్నికల కోలాహలం మొదలైంది. అనకాపల్లిలో 340 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. 3,286 వార్డులు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి. మొదటి దశలో 5,97,763 ఓటర్లు ఉండగా.. వారిలో పురుషుల సంఖ్య 2,92,654 , స్త్రీలు 3,05,085 గా ఉన్నారు. ఇతరులు 24 మంది ఓటర్లు ఉన్నారు.
మొదటి దశ ఫేస్ -1 రిటర్నింగ్ అధికారులు 120 , సహాయ రిటర్నింగ్ అధికారులు 120 మంది ఉంటారు. మొదటి దశ ఫేస్ 2కు 375 మంది రిటర్నింగ్ అధికారులు ఉంటారు. ఇక నేరుగా పోలింగ్ అధికారులు 3,636.. సహాయ పోలింగ్ అధికారులు 4,702 మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. అయితే ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కొవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. జిల్లా అధికారులు, ఎన్నికల విధుల్లో ఉండే వారికి కొవిడ్ వ్యాప్తి నివారణ కిట్లు ఇస్తున్నారు. దీనికి వైద్య శాఖ సహకారం అందిస్తోంది. ప్రతీ దశలో సుమారు 11 వేల మంది ఎన్నికలకు పనిచేయనున్నారు.
ఇదీ చదవండి: