విశాఖ కేజీహెచ్‌ను కరోనా కలవరం వీడడం లేదు. పిల్లల వార్డులో ఓ బాలిక మృతి చెందింది. మరణానంతర పరీక్షల్లో బాలికకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్థరణ అయింది. జిల్లాలోని జాలారిపేటకు చెందిన మూడేళ్ల బాలికను అనారోగ్యం కారణంగా తల్లిదండ్రులు కేజీహెచ్‌లో చేర్చారు. చికిత్స పొందుతూ నాలుగు రోజుల క్రితం బాలిక మరణించింది. ఈ బాలికకు ఒక ప్రొఫెసర్, ముగ్గురు సహాయ ప్రొఫెసర్లు, నలుగురు పీజీ వైద్యులు వైద్య చికిత్స అందించారు. వీరితో పాటు స్టాఫ్ నర్సులు ఇతర సిబ్బంది కూడా ఉన్నారు. బాలిక పరీక్ష నివేదిక రావడానికి నాలుగు రోజులు పట్టింది. ఈ సమయంలో బాలికతో ప్రైమరీ కాంటాక్ట్‌గా ఉన్న వీరంతా ఇతరులతో కలవడంతో వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందనే అనుమానం ఆయా వర్గాల్లో కనిపిస్తోంది. వీరందరికీ అధికారులు కోవిడ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
కేజీహెచ్‌లోని ఎస్ 2 వార్డులో... ముగ్గురు స్టాఫ్ నర్సులకు కోవిడ్ నిర్థరణ అయింది. మరో వైపు భావనగర్ ఎస్-6 వార్డుల్లో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులకు సైతం కొవిడ్ ఉందని తేలింది. మైక్రో బయాలజీ విభాగంలో విజయనగరం జిల్లా నమూనాలకు పరీక్షలు చేస్తున్న కేంద్రంలోని టెక్నీషియన్‌కు కోవిడ్ సోకింది. ఈ కారణంగా అక్కడ పని చేస్తున్న సిబ్బందికి కరోనా పరీక్షలు చేయడం సహా ఆయా ప్రాంతాలను సైతం శానిటైజ్ చేశారు. ఈ ప్రభావం పరీక్షల నిర్వహణపై పడింది.
ఇలా రోగులు, వైద్య సిబ్బంది, నర్సులు, టెక్నీషియన్లు కొవిడ్ బారిన పడుతుండడం కేజీహెచ్‌లో కలవరానికి కారణమైంది. వైరస్ వ్యాప్తి చెందకుండా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంటున్నామని... అనేక జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి అర్జున చెబుతున్నారు.
ఇదీ చదవండి: