విశాఖ జిల్లా హుకుంపేట మండలం బొండల మామిడిలో విషాదం జరిగింది. యువ దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మజ్జి దేవేందర్(25), మోహిని (22) దంపతులకు కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భర్త దేవేందర్.. ఆమెతో గొడవపడుతున్నాడు. వీరిద్దరి మధ్య పెద్దలు సయోధ్య కుదిర్చారు. అయినా.. వివాదం కొనసాగిందని స్థానికులు అంటున్నారు. ఈ కారణంగానే దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని అనుమానించారు. మజ్జి దేవేందర్, మోహిని దంపతులకు మూడేళ్ల పాప ఉంది. ఆ పాప ఇప్పుడు అనాథ అయ్యిందని కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు.
ఇదీ చదవండి: