దేవరాపల్లిలో హోం క్వారంటైన్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు విప్, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు హెల్త్డైట్ కిట్లను అందజేశారు. వీరికి 15 రోజులకు సరిపడా జీడిపప్పు, బాదంపప్పు, కిస్మిస్, ఖర్జూరం, బెల్లం, పెసలు, బొబ్బర్లు, కోడిగుడ్లను మివాన్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ సమకూర్చింది. వీటిని ఎమ్మెల్యే చేతుల మీదుగా బాధితులకు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలను అభినందించారు.
ఇదీ చదవండి :