విశాఖ జిల్లా అనకాపల్లిలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌గా 44 మందిని నిర్ధరించారు. పట్టణంలోని చింతావారివీధీలోని ఓ ఎలక్ట్రానిక్ దుకాణం నుంచి ప్రారంభమైన కేసులు నెమ్మదిగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాయి. ఇప్పటికే లోనిభట్లపూడి, రేబాక, సత్యనారాయణపురం, దేవినగర్‌లో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు.
కంటైన్మెంట్ జోన్లలో ప్రజల సమస్యలు తెలుసుకోడానికి ఎమ్మెల్సీ బుద్ధ నాగేశ్వరావు పర్యటించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆర్డీవోకు, పోలీసులకు, జీవీఎంసీ అధికారులకు సూచనలు చేశారు. అనకాపల్లి గ్రామీణ పోలీసుల ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు.
ఇదీ చదవండి : ధర్మవరం ఎమ్మెల్యే గన్‌మన్ కరోనాతో మృతి