ETV Bharat / state

Complaint On Ear Machines Problems: జగన్ మావయ్య.. మా గోడును పరిష్కరించవా ప్లీజ్​!! - Complaint On Ear Machines Problems in vishakha

Complaint On Ear Machines Problems: వినికిడి లోపం ఉన్న చిన్నారులకు ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్సలు చేసి, ఖరీదైన సాధనాలు అమర్చారు. తొలుత వాటి పని తీరు బాగున్నా తర్వాత పనికి రాకుండా పోతున్నాయి. పదే పదే బాగు చేయించుకోవడం ఆ పిల్లలను కన్నవారికి భారంగా మారింది. ప్రభుత్వం ఆదుకోవాలంటూ 8 జిల్లాలకు చెందిన చిన్నారుల తల్లిదండ్రులు విశాఖ కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందనలో మొర పెట్టుకున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : May 9, 2023, 9:00 AM IST

జగన్ మావయ్య మీ మాట వినిపించడం లేదు

Complaint On Ear Machines Problems: పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న చిన్నారులకు ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆరోగ్య శ్రీ పథకంలో బాధితులకు శస్త్రచికిత్సలు చేసి ఖరీదైన కాక్లియర్ ఇంప్లాట్ పరికరాలు అమర్చుతున్నారు. దీంతో వినికిడి సమస్య నుంచి ఉపశమనం లభించడమే కాకుండా చక్కగా మాట్లాడగలుగుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ చికిత్సలో వినియోగించే పరికరాల నిర్వహణ ఇప్పుడు కన్నవారికి భారంగా మారుతోంది.

పిల్లలకు అమర్చిన ఇంప్లాంట్ భాగాలూ మరమ్మతులకు గురైతే బాగుచేయించడానికి 12 వేల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తోంది. అంత మొత్తంలో ఖర్చు చేసే స్థోమత లేక, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. వాటిని ఉచితంగా బాగు చేయించి అందచేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు సోమవారం ఎనిమిది జిల్లాల నుంచి బాధిత తల్లిదండ్రులు విశాఖ కలెక్టరేట్​కు వచ్చి స్పందనలో అధికారులను వేడుకున్నారు. వినికిడి పరికరాల నిర్వహణ భారం తొలగించాలని కోరుతున్నారు.

విశాఖలోని ప్రభుత్వ ఈఎన్​టీ అసుపత్రిలో చిన్నారులకు అధునాతన వైద్య సేవలు అందిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఈ ఆసుపత్రికి వచ్చి వైద్యసేవలు పొందుతుంటారు. పదేళ్లలో వందల సంఖ్యలో పిల్లలకు శస్త్రచికిత్సలు చేసి, కాక్లియర్ ఇంప్లాంట్ పరికరాలు అమర్చారు. ఒక్కో వినికిడి పరికరం విలువ సుమారు 5 లక్షల రుపాయలపైనే ఉంటుంది. వీటిని అమర్చిన తర్వాత కంపెనీని బట్టి ఏడాది నుంచి మూడేళ్లు వరకు వారంటీ ఇస్తున్నారు.

కాలపరిమితి దాటిన తర్వాత పరికరాలు పాడైతే తల్లిదండ్రులు బాగు చేయించుకోవాలి. అయితే ఈ పరికరం విడిభాగాలు చాలా ఖరీదు కావడం, బాగు చేయించినా తరచూ మరమ్మతులకు గురవుతుండటంతో చిన్నారుల తల్లిదండ్రులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది ఖర్చు భరించలేక, రిపేరు చేయించకుండా వదిలేశారు. దీనివల్ల వినికిడి పరికరాలు పనిచేయకపోవడంతో ఆ చిన్నారులను మళ్లీ బధిరత్వం వెంటాడుతోంది.

కాక్లియర్ ఇంప్లాంట్‌ పరికారాల్లో ఏ చిన్నభాగం పనిచేయకుండా పోయినా వేలల్లో ఖర్చవుతుందని చిన్నారుల తల్లిదండ్రులు వాపోతున్నారు. మరికొన్ని భాగాలకైతే 3 లక్షల వరకు భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై స్పందనలో గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఉచితంగా వినికిడి పరికరాల మరమ్మతులు చేయించాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

"ఈ బ్యాటరీ రిపేర్ వచ్చింది. 3 బ్యాటరీలు చెడిపోయాయి. 3 ఒకేసారి చెయించుకోవడానికి కష్టంగా ఉండి. ఒక్కొక్క బ్యాటరీ 12,500 రూపాయలు అవుతుంది. అధికారును కలిస్తే 3 లక్షలు చేతిలో పెట్టుకోమన్నారు. మా దగ్గర అంత స్థోమత లేదు. అందకే మేమందరం కలిసి కలెక్టర్​కి అర్జీ ఇద్దామని వచ్చాము."- ప్రసన్న, నెల్లూరు జిల్లా

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.