ETV Bharat / state

విశాఖ వైసీపీలో అంతర్గత విభేదాలు.. పోలీసులకు ఫిర్యాదు - visakha mp mvv satyanarayana

COMPALINT ON YCP CORPORATOR IN VISAKHA : వైసీపీలో వర్గ విభేదాలు ముదురుతున్నాయి. ఒక వర్గం వారిపై అదే పార్టీకి చెందిన మరో వర్గం వారు ఘర్షణలకు దిగుతున్నారు. తాజాగా విశాఖలో మల్కాపురం 60వ వార్డు కార్పొరేటర్​పై అదే పార్టీకి చెందిన మరో నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

COMPALINT ON YCP CORPORATOR
COMPALINT ON YCP CORPORATOR
author img

By

Published : Nov 24, 2022, 5:29 PM IST

COMPALINT ON YCP CORPORATOR : విశాఖ మల్కాపురం 60వ వార్డు వైసీపీ కార్పొరేటర్ పీవీ సురేశ్​పై అదే పార్టీకి చెందిన రాష్ట్ర కార్యదర్శి పొట్టి మూర్తి ఫిర్యాదు చేశారు. తనను కొట్టడమే కాకుండా చంపేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలోనూ చాలాసార్లు ఇలాగే దాడి చేశారని పొట్టి మూర్తి తెలిపారు. రెండు నెలలు క్రితం విశాఖ ఎంపీ MVV సత్యనారాయణ ఎదుట తనపై కార్పొరేటర్ సురేష్ దాడి చేశారని పొట్టిమూర్తి ఆరోపించారు . సురేశ్‌ నుంచి తనకు ప్రాణహాని ఉందన్న పొట్టిమూర్తి ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.