'గులాబ్' తుఫాను ప్రభావంతో కలిగే విద్యుత్తు అంతరాయాలపై టోల్ ఫ్రీ 1912 కి ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపిడిసిఎల్) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కె. సంతోషరావు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ పునరుద్దరణ చర్యలు చేపట్టేందుకు సంస్థ డైరెక్టర్లు, ఆపరేషన్స్, ప్లానింగ్, కమర్షియల్, మెటీరియల్ పర్చేజస్ విభాగపు అధికారులతో సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఆదివారం ఉదయం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. డైరెక్టర్ ప్రాజెక్ట్స్ కె. రాజబాపయ్య శ్రీకాకుళం సర్కిల్, డైరెక్టర్ ఆపరేషన్స్ బి. రమేష్ ప్రసాద్ విజయనగరం సర్కిల్, డైరెక్టర్ ఫైనాన్స్ డి.చంద్రం విశాఖపట్నం సర్కిల్ల పునరుద్దరణ చర్యలను పర్యవేక్షిస్తారని తెలిపారు.
తుఫాను ప్రభావానికి తెగిపడే విద్యుత్ వైర్లను, విద్యుత్ స్తంభాలను, ట్రాన్స్ఫార్మర్లను సరిచేయడానికి అవసరమైన యంత్రాంగాన్ని, పరికరాలను, సిబ్బందిని అప్రమత్తంగా, అందుబాటులో ఉంచాలని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల సూపరింటెండింగ్ ఇంజనీర్లకు సీఎండి ఆదేశాలిచ్చారు.
కంట్రోలు రూమ్ ఫోన్ నెంబర్లు..
కార్పోరేట్ ఆఫీసు | 9440816373 8331018762 |
సిజీఎం ఆపరేషన్స్ | 9440812567 |
జిఎం కాల్ సెంటర్ | 9440814206 |
శ్రీకాకుళం | 9490612633 |
పాలకొండ | 7386764579 |
టెక్కలి | 6305107900 |
విజయనగరం | 9490610102 |
బొబ్బిలి | 9492666989 / 9490610121 |
పార్వతీపురం | 9440814205 |
విశాఖపట్నం | 7382299975 |
అనకాపల్లి | 9885262424 |
నర్సీపట్నం | 9491030714 |
పాడేరు | 9490610026 |
ఇదీ చదవండి : GULAB EFFECT: అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల శాఖ