ETV Bharat / state

ఆ రికార్డుల భద్రత రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులదే: కలెక్టర్​

గ్రామాలకు సంబంధించి డాక్యుమెంటేషన్ రికార్డులను భద్రపరచాలని రెవెన్యూ, అట‌వీ శాఖ అధికారులను విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ ఆదేశించారు. విశాఖపట్నం మున్సిపల్​ కార్యాలయంలో ఆర్ఓఎఫ్ఆర్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు.

collector vinay chand review meeting on documentations at visakhapatnam municipal corporation
ఆ రికార్డుల భద్రత రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులదే: కలెక్టర్​
author img

By

Published : Sep 26, 2020, 11:07 PM IST

డాక్యుమెంటేషన్​ రికార్డులను రెవెన్యూ, ఫారెస్ట్ శాఖలు భద్రపరచాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ ఆదేశించారు. గ్రామాల్లో ఎవరు భూములు ఇచ్చారో వారి పాస్​బుక్​లు, టైటిల్ డీడ్స్, ఫోటోలు.. రికార్డులలో భద్రపరచి ఉంచుకోవాలన్నారు. నిబంధ‌న‌ల‌ ప్రకారం అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. విశాఖపట్నం మున్సిపల్​ కార్యాలయంలో అధికారులతో ఆర్ఓఎఫ్ఆర్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు.

గ్రామ సచివాలయం, తహసీల్ధార్, ఆర్డీవో సంబంధిత కార్యాలయాల్లో డాక్యుమెంటేషన్ నఖలు, ఫోటోలు పక్కాగ ఉండాలని ఆదేశించారు. ఏజెన్సీ పరిధిలోని ఆయా మండలాల్లో ఆర్ఓఎఫ్ఆర్​కు సంబంధించి మండలాల వారిగా.. ఎంతెంత భూములు ఉన్నాయో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎస్. వెంకటేశ్వర్ కలెక్టర్​కు వివరించారు.

అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో దేవరాపల్లి, వి. మాడుగుల, చీడికాడ మండలాల్లో ఓఆర్ఎఫ్(ఔట్ సైడ్ రిజర్వ్ ఫారెస్ట్) రిజర్వ్ ఫారెస్ట్ భూముల గూర్చి అనకాపల్లి ఆర్డీఓ సీతారామారావు వివరించారు. నర్సీపట్నం డివిజన్​లో ఆయా మండలాల్లోని భూముల వివరాలను సబ్​కలెక్టర్ నారపురెడ్డి మౌర్య తెలియజేశారు. గిరిజ‌న ప్రాంతాల చెందిన రెవెన్యూ, అట‌వీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

'మనకు ఎన్నో ఇచ్చిన అడవికి ఎంతో కొంత తిరిగివ్వాలి.. లేకపోతే!'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.