Hindustan Shipyard MD Hemanth kumar: విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డుకు ప్రస్తుతం 2వేల కోట్ల రూపాయల ఆర్డర్స్ ఉన్నాయని ఆ సంస్థ సీఎండీ హేమంత్ కుమార్ వెల్లడించారు. త్వరలో వచ్చే ఆర్డర్‌తో అది రూ.20వేల కోట్లకు చేరుతుందని ఆయన తెలిపారు. సకాలంలో హెచ్ఎస్ఎల్ ఉత్పత్తులను అందించడం ద్వారా మరిన్ని భారీ ఆర్డర్‌లు పొందగలుగుతుందన్నారు. అంతేకాకుండా ఇటీవల నాలుగు టగ్ బోట్‌లను నిర్మించి నౌకాదళానికి అందించామని హేమంత్ కుమార్ పేర్కొన్నారు.
ఇవి చదవండి: