ETV Bharat / state

నన్ను అరెస్ట్​ చేసినా భయపడను: చంద్రబాబు - dgp

'నన్ను ఏకాకి చేసి దాడులు చేసినా భయపడేది లేదు. రేపు నన్ను కూడా అరెస్టు చేసినా భయపడను. జైలులో కూర్చోనైనా పోరాటం చేస్తా. అమిత్ షా అంటాడు నాకు తలుపులు మూసేశాడని.. నిన్ను తలుపులు తీయమని ఎవరు అడిగారు': విశాఖ రోడ్​షోలో చంద్రబాబు

విశాఖ రోడ్​షోలో చంద్రబాబు
author img

By

Published : Apr 5, 2019, 11:08 PM IST

రాష్ట్రంలో అధికారుల బదిలీలను ఖండిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖలోని కంచరపాలెంలో నిర్వహించిన రోడ్​షోలో కేంద్రంపై నిప్పులు చెరిగారు. 'తెదేపా నేతలే లక్ష్యంగా దాడులు చేస్తారా? నేరస్థులకు కాపల కాసే వ్యక్తి, చేతకాని మనిషి ఈ నరేంద్రమోదీ. కోడికత్తి పార్టీ చెప్పింది కదా అని కేంద్రం.. ఎన్నికల సంఘాన్ని ఉపయోగించుకుని అధికారులను బదిలీ చేయిస్తే నేను భయపడాలా? ఏ తప్పూ చేయని అధికారులను బదిలీ చేస్తారా? ఏం చేస్తారో చేయండి నేనూ చూస్తా... లెక్క కూడా చేయను. నేను ధర్మం కోసం పోరాడుతున్నా... నా నలభైయేళ్ల రాజకీయ జీవితంలో ఇంత దుర్మార్గమైన చర్య ఎన్నడూ చూడలేదు. నన్ను ఏకాకి చేసి దాడులు చేసినా భయపడేది లేదు. రేపు నన్ను కూడా అరెస్టు చేసినా భయపడను. జైలులో కూర్చోనైనా పోరాటం చేస్తా. అమిత్ షా అంటాడు నాకు డోర్​లు మూసేశాడని.. నిన్ను తలుపులు తీయమని ఎవరు అడిగారు. నిన్ను ఏకంగా రాష్ట్రం నుంచే బహిష్కరించా. మీ రాజకీయాలు మా రాష్ట్రంలో చెల్లవు' అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు.

Ap_Vsp_61_05_East_Congress_Candidate_Srinivas_Campaign_Av_C8 Camera/Contributor: Ch. P. Reddy. Centre: Visakhapatnam. విశాఖ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్ధి వి.శ్రీనివాసరావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావాలంటే అది ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యమని... అందుకే ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తూర్పు నియోజకవర్గంలోని పెదజాలారి పేట,లాసన్స్ బే కోలనీ, చినవాల్తెరు తదితర ప్రాంతాలలో వజ్జిపర్తి శ్రీనివాస రావు పర్యటించారు. (ఓవర్).
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.