నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ నాయకులు విశాఖలో ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం బడా వ్యాపారవేత్తలకు కొమ్ముకాస్తూ.. కార్మికుల పొట్టలు కొట్టేందుకు ప్రయత్నిస్తోందని సీఐటీయూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీ గాంధీ పార్కులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్మికులను ఇబ్బందులకు గురిచేసే చట్టాలను రద్దు చేసే వరకు.. ఉద్యమాలు తప్పవని హెచ్చరిస్తూ.. నూతన కార్మిక చట్టాల ప్రతులను దగ్ధం చేశారు.
44 లేబర్ కోడ్లను రద్దు చేయాలి..
44 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని.. కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ.. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే రాష్ట్రంలో నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించి.. భవన నిర్మాణ కార్మికులకు అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలను నిలిపేసిందని డివిజన్ ఉపాధ్యక్షులు కొయ్య లక్ష్మణరావు పేర్కొన్నారు. ఈ పరిణామం వల్ల భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద పరిహారం, పిల్లల స్కాలర్ షిప్లు, వివాహ పారితోషికాలు నిలిచి పోయాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్ జీవో కాపీలను గౌరీ పరమేశ్వర పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు దగ్ధం చేశారు.
ఇవీ చూడండి: