విశాఖలో ఉత్సాహంగా బాలల దినోత్సవం విశాఖ వీఎమ్ఆర్డీఏ థియేటర్లో విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొని అలరించారు. బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్విజ్ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు మంత్రులు బహుమతులు అందించారు.
మంత్రి కన్నబాబు మాట్లాడుతూ నాడు-నేడు పథకం ఒక ఛాలెంజ్ కార్యక్రమం అనీ, ఇది ప్రభుత్వ కార్యక్రమంగా చూడకూడదని తెలిపారు. ప్రపంచంలో ముందుకు వెళ్లడానికి ఇంగ్లీష్ అవసరమని, ప్రభుత్వం తెలుగును రద్దు చేయలేదని వివరించారు. తల్లిదండ్రులు చదవాలని విద్యార్థులపై ఒత్తిడి పెట్టకూడదని మంత్రి అవంతి అన్నారు.
ఇదీ చదవండి: విశాఖలో దివ్యాంగ విద్యార్థుల నృత్య పోటీలు