దేశంలో నావికాదళ ఉద్యోగులంతా ఆరోగ్యంగా ఉండి తమ విధి నిర్వహణలో దేశ ప్రజలకు సాయం అందించడంలో ముందుండాలని విశాఖపట్నంలో నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ కరంవీర్ సింగ్ సందేశం ఇచ్చారు. నౌకాదళం ఎన్నో క్లిష్ట సమయాల్లో కీలకపాత్ర పోషించి ప్రజలకు అండగా నిలబడిందని ఆయన గుర్తుచేశారు. దేశం ఇప్పుడు అత్యంత సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని... కరోనా నియంత్రణలో మన పాలుపంచుకోవాలని ఆయన తెలిపారు. ఆయా రాష్ట్రాల జిల్లా యంత్రాంగాలతో కలిసి నేవీ సిబ్బంది పనిచేయాలని కరంవీర్ సింగ్ పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: