విశాఖ జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్లో.. జూన్ 29 న జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరణించిన గౌరీ శంకర్ కుటుంబానికి పరిహారం చెక్కులను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అందించారు. మహంతి గౌరీ శంకర్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఎక్స్ గ్రేషియా రూ.15 లక్షల చెక్కును..మృతుని భార్య కోట్ల వెంకట లక్ష్మికి అందించారు. సాయినార్ కంపెనీ తరపున ఇస్తున్న ఎక్స్ గ్రేషియా రూ. 35 లక్షల మొత్తానికి సంబంధించి.. మృతిని భార్యకు రూ. 10 లక్షలు, తండ్రి మహంతి లక్ష్ము నాయుడుకు రూ. 12.50 లక్షలు, తల్లి మహంతి అప్పల నరసింహకు రూ. 12.50 లక్షల చెక్కులను సైతం మంత్రి అందించారు.
ఇదీ చదవండి: ఆకలి తీర్చలేక శిశువు విక్రయం.. గ్రామస్థుల ఆపన్నహస్తం