విశాఖ జిల్లా పెందుర్తిలో రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని కేటుగాళ్లు నిరుద్యోగులను మోసం చేశారు. అమాయకుల వద్ద నుంచి రూ.20 లక్షలు వసూలు చేశారు. తప్పుడు నియామక పత్రాలతో బురిడీకొట్టించారు. హైదరాబాద్ పంపించి నెల రోజులపాటు శిక్షణ ఇప్పించారు. తిరిగి పిలుస్తామనిచెప్పి పరారయ్యారు. ఇంకా పిల్తుసారనుకుని బాధితులు ఎదురు చూశారు. ఇంకా ఎలాంటి సమాచారం రాకపోవటంతో నిందితులను నిలదీస్తే... ఒంగోలులోని హిందుస్థాన్ శిక్షణ కేంద్రంలో ఇస్తామని నమ్మబలికారు. అనుమానం వచ్చిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.
ఇదీ చూడండి