విశాఖ జిల్లా చీడికాడ మండలం జి. కొత్తపల్లిలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. చెరుకు తోటలో నాటుసారా తయారీ చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎస్సై సురేశ్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. 600 లీటర్ల బెల్లం ఊటను పారబోసి ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు.
ఇదీ చదవండి : అర్జునగిరిలో నాటుసారా స్థావరాలపై దాడులు.. బెల్లం ఊట ధ్వంసం