విశాఖలో 2 రోజుల చంద్రబాబు పర్యటన తెదేపా శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపింది. పార్టీ శ్రేణుల్లో మానసిక స్థైర్యం పెంచే దిశగా జిల్లాల్లో పర్యటిస్తున్న ఆయన... విశాఖ కార్యకర్తల నుంచి విస్తృతస్థాయిలో అభిప్రాయాలు సేకరించారు. పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై నేతలు, కార్యకర్తలు అభిప్రాయాలను తీసుకున్నారు. ఐదేళ్లుగా పార్టీకి తగిన సమయం కేటాయించలేకపోయిన తనకు... ఈ పర్యటన ఎంతో సంతప్తినిచ్చిందన్నారు. సమీక్షల్లో.. సీఎం జగన్ తీరుపై విమర్శనాస్త్రాలు సంధించిన చంద్రబాబు... రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేలా వైకాపా పాలన ఉందని ఆరోపణలు చేశారు.
నవంబర్, డిసెంబర్ నెలల్లో పార్టీ కమిటీల ఎన్నికలు నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. యువత, మహిళలు, బలహీన వర్గాలకు పార్టీ పదవుల్లో సముచిత స్థానం కేటాయిస్తామన్న ఆయన.. రిజర్వేషన్లు ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సహం నింపేలా వచ్చే 2 నెలల్లో మొత్తం 13 జిల్లాల్లో పర్యటిస్తానని తెదేపా అధినేత స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :