ETV Bharat / state

Vishaka Steel Plant: స్టీల్ ప్లాంట్​పై రెండునాల్కల ధోరణి ఏంటీ..? కేంద్రంపై కార్మిక సంఘాల మండిపాటు - ఆర్​ఐఎన్​ఎల్​ సీఎండీ అధికార బంగ్లా

Vizag Steel Plant Privatization : విశాఖ స్టీల్​ ప్లాంట్​ ప్రైవేటీకరణపై కేంద్రం చేసిన తాజా ప్రకటనపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. కేంద్ర మంత్రి ప్రకటనకు విరుద్దంగా, ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతుందన్న ప్రకటనపై .. వారు మండిపడ్డారు. కేంద్రం దిగోచ్చేవరకు తమ ఉద్యమ కార్యాచరణ ఉంటుందని వారు వెల్లడించారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 15, 2023, 7:15 AM IST

Updated : Apr 15, 2023, 8:49 AM IST

Vizag Steel Plant Padayatra: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్ర పాలకుల రెండు నాల్కల ధోరణి మరోసారి బహిర్గతమైంది. సంస్థను ప్రైవేటుపరం చేయాలనుకోవడం లేదని కేంద్ర మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో.. ఉక్కు శాఖ దీనిపై స్పష్టత ఇచ్చింది. స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగలేదంటూ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనపై కార్మిక సంఘాలు తీవ్రంగా స్పందించాయి. పూటకో మాట మారుస్తున్నారంటూ మండిపడ్డాయి. కేంద్రం దిగొచ్చేవరకు తాము ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ఉద్యోగ సంఘం నేతలు హెచ్చరించారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై గందరగోళం నెలకొన్న వేళ కేంద్రం మరోసారి స్పష్టతనిచ్చింది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగలేదని ఉక్కు శాఖ ప్రకటన వెలువరించింది. ఆర్​ఐఎన్​ఎల్​లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియకు ఎలాంటి అడ్డంకులు లేవని.. ప్రస్తుతం ఈ ప్రక్రియ పురోగతిలో ఉందని వెల్లడించింది. విశాఖ స్టీల్స్ పనితీరును మెరుగుపరిచి, దాన్ని నిలబెట్టడానికి ఆర్​ఐఎన్​ఎల్​ ప్రయత్నాలు చేస్తోందని.. అందుకు ప్రభుత్వం మద్దతిస్తోందని పేర్కొంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ విధానం కింద ప్రభుత్వరంగ సంస్థలను స్ట్రాటెజిక్‌, నాన్‌స్ట్రాటెజిక్‌ సెక్టార్లుగా కేంద్రం విభజించింది. నాన్‌స్ట్రాటెజిక్‌ విభాగంలోని ప్రభుత్వ సంస్థలను సాధ్యమైన చోట ప్రైవేటీకరించాలని.. లేదంటే మూసేయాలని నిర్ణయించింది. విశాఖ ఉక్కును.. స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాతో విలీనం చేయాలన్న విజ్ఞప్తులనూ కేంద్రం తోసిపుచ్చింది. నూతన ప్రభుత్వరంగ సంస్థల విధానం ప్రకారం.. ఆర్​ఐఎన్​ఎల్​ను ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విలీనం చేయడం కుదరదంటూ.. పదే పదే పార్లమెంటుకు చెబుతూ వస్తోంది.

ఉద్యమ కార్యచరణ ప్రకటించిన కార్మికులు : కేంద్ర ప్రభుత్వ తీరుపై ఉక్కు పోరాట కమిటీ, కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. ప్లాంట్‌ను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసేందుకే కేంద్రం నాటకాలని నాయకులు మండిపడుతున్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణపై ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఇవాళ కూర్మన్నపాలెం నుంచి సింహాచలం అప్పన్న దేవస్థానం వరకు పాదయాత్ర చేయనున్నారు. 25న ఆర్​ఐఎన్​ఎల్​ సీఎండీ అధికార బంగ్లాను ముట్టడిస్తామని హెచ్చరించారు. మరోవైపు కార్మికులు కూడా ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ప్రాణాలకు తెగించైనా పరిశ్రమను కాపాడుకుంటామని తేల్చిచెప్పారు.

"తాత్కలికంగా వాయిదా వేస్తున్నాం, ధృడ పరుస్తున్నాం అంటున్నారు. అసలు ఏం చేస్తున్నారు. ఉక్కు గనులు కేటాయించమని అడిగితే కేటాయించలేదు. విశాఖ స్టీల్​ ప్లాంట్​ను బంధించారు. అందుకనే మా పోరాటం." -కార్మిక సంఘం నేత

"విశాఖ స్టీల్​ ప్లాంట్​ యాజామాన్యం మాత్రం ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుని కేంద్రానికి తప్పుడు సంకేతాలు పంపితే.. కార్మిక వర్గం స్టీల్​ ప్లాంట్​ పాలన భవనాన్ని కూడా ముట్టడిస్తుందని హెచ్చరిస్తున్నాము."-కార్మిక సంఘం నేత

అటు విశాఖ ఉక్కు 2022-23 ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు నాటికి 2 వేల 927 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. గత ఏప్రిల్‌తో పోలిస్తే డిసెంబరు నాటికి కంపెనీ నెట్‌వర్త్‌ 85 శాతం తగ్గిపోయినట్లు పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇటీవల సమర్పించిన నివేదికలో పేర్కొంది. సంస్థకు కేటాయించిన ప్రణాళిక వ్యయంలో 72.29 శాతం మాత్రమే ప్లాంటు ఖర్చుచేసింది. 2022 ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు 15వేల 618 కోట్ల టర్నోవర్‌ నమోదు చేసింది.

స్టీల్ ప్లాంట్​పై రెండునాల్కల ధోరణి

ఇవీ చదవండి :

Last Updated : Apr 15, 2023, 8:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.