కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను ఇళ్లవద్దే జరుపుకోవాలని మంత్రి అవంతి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. విశాఖ జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలిసి రంజాన్ వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరిమితులకు లోబడి పండుగ నిర్వహించుకోవాలని ముస్లిం మత పెద్దలకు సూచించారు. వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలన్నారు. విశాఖలో సుమారు 25వేల మంది ముస్లింలు ఉన్నారని.. వారందరికీ ప్రగతి భారతి ట్రస్టు ద్వారా నిత్యావసరల పంపిణీ చేస్తామన్నారు.
ఇదీచదవండి