విశాఖ గ్రామీణ జిల్లా పరిధిలో రవాణా కష్టాలు.. ఆ ప్రాంత ప్రజలకు నరకం చూపిస్తున్నాయి. నదులపై నిర్మిస్తున్న వంతెనలు పూర్తి కాని పరిస్థితుల్లో.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శారదా నదిపై చోడవరం, మాడుగుల నియోజకవర్గంలో వంతెనలు పూర్తి కాలేదు. నత్తనడకగా వీటి నిర్మాణాలు సాగుతున్నాయి. రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
చోడవరం మండలం గవరవరం వద్ద శారదా నదిపై రూ.15 కోట్లతో చేపట్టిన వంతెన పనులు జరుగుతున్నాయి. ప్రజల రాకపోకలు సాగించేందుకు తాత్కాలిక కాజువే నిర్మాణం, రహదారుల భవనాల శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కాజ్వే అక్టోబరు నెలలో వరద నీటి ప్రవహానికి ధ్వంసమైంది.
కోటపాడులో 2013 నుంచి ఈ ఇబ్బందులు తప్పడం లేదని... అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. అధికారులు రూ.5 లక్షల కాజువే నిర్మాణానికి ప్రతిపాదించినట్లు రహదారుల భవనాల శాఖ చోడవరం సెక్షన్ కార్యాలయ సహాయక ఇంజినీరు గణేష్ తెలిపారు. కాజ్వే త్వరగా చేయాలని చోడవరం, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: