విశాఖలో వైకాపా నేతలకు సంబంధించి 30వేల ఎకరాలకుపైగా భూ రిజిస్ట్రేషన్లు జరిగాయనటానికి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా అన్నారు. వాటి విలువ పెంచుకునేందుకే విశాఖ పరిపాలనా రాజధాని అని వైకాపా నేతలు రోజుకోమారు అంటున్నారు ధ్వజమెత్తారు. ఇన్సైడర్ ట్రేడింగ్ కింద వాటిపై ఎందుకు కేసులు పెట్టట్లేదని నిలదీశారు.
తాడేపల్లిలో నివాసం ఏర్పర్చుకున్న సీఎం జగన్ చేసిందీ ఇన్సైడర్ ట్రేడింగ్ కాదా అని బొండా ఉమా ప్రశ్నించారు. సొంత వ్యాపారం కోసం తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి రాజధానికి దూరంగా కంతేరు గ్రామంలో ఎకరా 50సెంట్లు కొనుగోలు చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేశారని బొండా తప్పుబట్టారు.
ఇదీ చదవండి: రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందే: ఎన్జీటీ