అనకాపల్లి ఎంపీ డాక్టర్ బీశెట్టి వెంకట సత్యవతి తన జన్మదిన వేడుకలను గురువారం స్వగృహంలో కుటుంబ సభ్యుల మధ్యనిరాడంబరంగా జరుపుకున్నారు. పలువురు ప్రముఖులు, నేతలు సామాజిక మాధ్యమాల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ మెయిల్ ద్వారా, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా ట్విట్టర్లో ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నేపథ్యంలో అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన వైకాపా నాయకులు, కార్యకర్తలు చరవాణీ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి :