BCCI President Roger Binny Participated in ACA Celebrations: దేశంలో క్రికెట్‌కు ఎదురవుతున్న ప్రధాన సమస్యలలో ఆటగాళ్ల ఫిట్నెస్ ఒకటని.. దీనిని అధిగమించేందుకు అవసరమైన సహకారాన్ని బీసీసీఐ వారికి అందిస్తోందని.. బీసీసీఐ ఛైర్మన్ రోజర్ బిన్నీ (bcci chairman roger binny) అన్నారు. దేశంలో క్రికెట్ మౌలిక సదుపాయాలను అభివృద్ది చేసేందుకు అవసరమైన విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఎపీఎల్, ఐపీఎల్ అనేవి అటగాళ్లకు ఎంతో ఉపకరిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో, దేశంలో అందుకు తగిన మంచి వేదికలుగా ఉన్నాయన్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఎసీఎ) 70 వసంతాల ఉత్సవాల్లో భాగంగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వెటరన్ క్రీడాకారుడు మదన్ లాల్, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ఏసీఏ కార్యవర్గంతో కలిసి పైలాన్‌ను ఆవిష్కరించారు. మహిళా క్రికెట్ అభివృద్దికి ఎంతో ప్రోత్సాహాన్నిఇస్తున్నామన్న బిన్నీ దీనికి కోసం వివిధ రాష్ట్రాలలో కూడా సదుపాయాలు అభివృద్ది జరుగుతోందని వివరించారు.
క్రీడాకారులకు గతంలో కంటే ప్రస్తుతం అనేక అవకాశాలు లభిస్తున్నాయని రోజర్ బిన్నీ పేర్కొన్నారు. ప్రతిభను ప్రదర్శించుకోవడానికి నేటి యువ క్రీడాకారులకు రంజీ ట్రోపీ, దిలీప్ కప్, ఐపీఎల్(IPL)... లాంటి అనేక అవకాశాలు వస్తున్నాయని వెల్లడించారు. క్రికెట్ కోసం పాఠశాల స్థాయి నుంచి, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పాల్గొనేందుకు అనేక అవకాశాలు కల్పిస్తున్నామని రోజర్ బిన్నీ తెలిపారు. పాఠశాల స్థాయి నుంచి క్రికెట్ పోటీల వల్ల... అనేక అవకాశాలు లభించేందుకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు. గతంలో కంటే ఐపీఎల్ ప్రారంభం అయిన తరువాత ఎంతో మంది క్రీడాకారులకూ కొత్తగా అవకాశాలు వచ్చాయని రోజర్ బిన్నీ వెల్లడించారు. ప్రపంచ కప్ భారత్ గెలుస్తుందా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, క్రికెట్ అభిమానుల్లో ముగ్గురిలో ఇద్దరు ఇదే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. భారత్ క్రికెట్‌కు ప్రపంచకప్(World Cup) తొలిసారిగా సాధించిన కపిల్ దేవ్ పైనా, జట్టుకు సారధిగా ధోనీ పైనా అభిప్రాయం అడిగినపుడు అసక్తికరంగా సమాధానమిచ్చారు.
అనంతలో.. ఏపీ-యూపీ క్రికెట్ పోటీలు
ఏపీఎల్-2 - వైజాగ్ వేదికగా నెల 16వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్‌లో(Andhra Pradesh Premier League) ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరు టీమ్‌లు ఈ పోటీలలో తలపడనున్నాయి. భారత్ క్రికెట్ జట్టులో ఆడుతున్న భరత్, విహారి వంటి ప్లేయర్లు ఈ మ్యాచ్‌లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్‌లో మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. ఇలాంటీ పోటీలు నిర్వహించడం వల్ల ఐపీఎల్, ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లలో పాల్గొనే అవకాశాలు లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు. సీజన్-1 మంచి ఫలితాలు ఇచ్చిందని, ఇందులో పలువురు క్రీడాకారులు ఐపీఎల్లో స్థానం దక్కించుకున్నారన్నారు.