బేసిక్ హెల్త్ కేర్ మెడికల్ ప్రాక్టిషనర్ జిల్లా సంఘం ఎన్నికలు విశాఖ జిల్లా బలిఘట్టంలో జరిగాయి. జిల్లా అధ్యక్షుడిగా కృష్ణదేవిపేటకు చెందిన లక్ష్మణరావు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం కాలపరిమితి ముగియడం వల్ల ఎన్నిక అనివార్యమైంది. సంఘం కార్యదర్శిగా ఎంవీ సత్యనారాయణ, కోశాధికారిగా గణేష్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు రాష్ట్ర కమిటీ అధ్యక్షులు గణపతి, రాష్ట్ర కార్యదర్శి కోటిబాబు, వివిధ మండలాలకు చెందిన ప్రైవేటు వైద్యులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :