జీవో నెం 3ను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై రాష్ట్ర గిరిజన సంఘాలు గిరిజన ప్రాంతాల్లో బుధవారం నుంచి 48 గంటల పాటు నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. ఉదయం నుంచే జేఏసీ నాయకులు, గిరిజనులు రహదారులపైకి వచ్చి ఆందోళన చేశారు. రహదారిపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. గూడెంకొత్తవీధి, చింతపల్లి, కొయ్యూరు మండలాల్లో మైదాన ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు, బస్సులు, ద్విచక్రవాహనాల రాకపోకలు నిలిపివేశారు. చింతపల్లిలో జరిగే బుధవారం జరిగే వారపు సంత నిలిచిపోయింది.
ఇదీ చదవండి : విశాఖ మన్యంలో ప్రశాంతంగా ముగిసిన బంద్