ETV Bharat / state

వైభవంగా బాలవికాస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం - visakahapatnam

విశాఖలో సత్యసాయి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులంతా ఉన్నత విలువలు కలిగిన వ్యక్తులుగా మారాలనీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు చలం ఆకాంక్షించారు.

వైభవంగా బాలవికాస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
author img

By

Published : Aug 12, 2019, 9:40 AM IST

వైభవంగా బాలవికాస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

సత్యసాయి బాలవికాస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం రెండురోజుల పాటు విశాఖపట్నంలోని మిథిలాపుర్ కాలనీలో అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ సత్య సాయి బాలవికాస్ పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులంతా కలసి పాల్గొన్న ఈ సమ్మేళనంలో సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల స్పీచెస్, నృత్యాలు, భజనలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.జి. చలం మాట్లాడుతూ.. బాలవికాస్ విద్యార్థులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలకి పునాది లాంటి వారని అభివర్ణించారు. బాలవికాస్ బోధనా పద్ధతిని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు స్థాపించగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా బాలవికాస్ గురువులకి, విద్యార్థులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది సంవత్సరాలపాటు బాలవికాస్ బోధనా పద్ధతి ద్వారా నేర్చుకున్న మానవతా విలువలు, అంశాలు పిల్లలకు అన్ని విషయాల్లో పరిణతి కలిగించి సమాజ సేవలో పాల్గొనేలా, ఉన్నతమైన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంలో ఎంతగానో దోహద పడతాయని ఆయన అన్నారు.

ఇదీ చూడండి:గోదారి ప్రవాహానికి తలవంచిన వృక్షాలు

Intro:AP_VSP_56_12_DONKARAYI POWER CANAL KU GANDI_AV_AP10153Body:విశాఖ తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుల్లో సీలేరు కాంప్లెక్స్‌ లో ఉన్న డొంకరాయి జలాశయానికి అర్థరాత్రి సమయంలో గండికొట్టింది. పక్కనే ఉన్న పోలీసుస్టేషన్‌ సిబ్బంది నీరు ప్రవహిస్తున్న శబ్దాన్ని గమనించిన జెన్‌కో అధికారులకు తెలియజేయడంతో విషయం బయటకు వచ్చింది. దీనికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. సీలేరు కాంప్లెక్స్‌లోని డొంకరాయి జలవిద్యుత్‌కేంద్రంలో విద్యుదుత్పత్తి అనంతరం విడుదలైన నీరు సుమారు 16 కిలోమీటర్లు పొడవులో ఉన్న పవర్‌ కెనాల్‌ ద్వారా పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రానికి చేరుకుంటుంది. గత పదిరోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువప్రాంతాలు నుంచి వస్తున్న వరద నీరుతో నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం అర్థరాత్రి పవర్‌కెనాల్‌కు పెద్ద ఎత్తున కోతకు గురై భారీ ఎత్తున గండిపడింది. జలవిద్యుత్కేంద్రానికి అరకిలోమీటరు దూరంలో ఉన్న మొదటి హెడ్‌ రీచ్‌ ఎక్విడేట్‌ మొదటి బాగం వద్ద పవర్‌కెనాల్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో పోలీసుస్టేషన్‌ ముందు నుంచి కాలువ ద్వారా భారీగా నీరు ప్రవహించే శబ్దాన్ని గమనించిన పోలీసులు జెన్‌కో అధికారులకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన అధికారులు పవర్‌కెనాల్‌ వద్ద పెట్రోలింగ్‌ నిర్వహించగా మొదటి బాగంలో కెనాల్‌కు 20 మీటర్లు వరకూ గండిపడిన విషయం బయటపడింది. దీంతో జెన్‌కో అధికారులు డొంకరాయి జలవిద్యుత్కేంద్రంలో విద్యుదుత్పత్తి నిలిపివేసి కెనాల్‌కు నీరు వెళ్లే గేటును మూసివేశారు. అప్పటికే గండిపడటంతో పవర్‌కెనాల్‌ నుంచి వస్తున్న నీరు కన్నబ్బాయిక్యాంపులోకి ప్రవేశించింది. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈలోగా అధి్కారులు ఇసుక బస్తాలతో గండిని పూడ్చివేసే ప్రయత్నం చేపట్టారు. పవర్‌కెనాల్‌కు నీటిప్రవాహం తగ్గినప్పటికీ, ప్రస్తుతం వస్తున్న నీటినిల్వలు ఎటు మళ్లించాలో అన్న విషయంపై అధికారులు చర్చలు సాగిస్తున్నారు. జెన్‌కో అధికారులు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని గండిని పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. Conclusion:m rAMANARAO,sILERU,AP101153

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.