కుక్క అడ్డు రావటంతో.. ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన విశాఖ జిల్లా పాడేరు మన్యంలో జరిగింది. గుడుగుపల్లికి చెందిన ఢిల్లేశ్వరరావు హుకుంపేట నుంచి స్వగ్రామానికి ఆటోలో బయలుదేరాడు. గుడుగుపల్లికి సమీపంలోకి వచ్చేసరికి... ఆటోకి కుక్క అడ్డం రావటంతో, ఢిల్లీశ్వరరావు బ్రేక్ వేయడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఢిల్లీశ్వరరావు తలకి ఆటోలో ఇనుప రాడ్ తగిలి... రక్తస్రావమై మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇదీ చదవండి: నర్సీపట్నంలో భారీ వర్షం..వ్యవసాయ పనులు మొదలుపెట్టిన రైతులు