గ్రామాల్లో నిత్యం తగాదాలకు కారణమవుతున్న భూరికార్డుల ప్రక్షాళన కొన్ని దశాబ్దాలుగా ఘర్షణల మధ్య అలాగే ఉండిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక సహాయంతో ఇతర సమాచారాన్ని రూపొందించి ఏ వివాదాలకు తావు లేకుండా చూడాలని భావిస్తోంది. సచివాలయాల సర్వేయర్లతో దీనిని విజయవంతంగా పూర్తి చేయాలని తలపెట్టింది. అందుకోసమే వారికి ఆధునిక యంత్ర పరికరాలు సాఫ్ట్వేర్లపై శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. భూముల సర్వేకు ఇటీవల వరకు ఇనుప గొలుసులు ఇతర పరికరాలు వినియోగించేవారు. ప్రస్తుతం కచ్చితమైన భూ లెక్కల కోసం ఆధునిక ఎలక్ట్రికల్ టోటల్ స్టేషన్. డీజీపీఎస్, జీపీఎస్ తదితర పరికరాలు వినియోగానికి చర్యలు తీసుకుంటున్నారు .
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని సర్వే అకాడమీలో తర్ఫీదు పొందిన మాస్టర్ ట్రైనర్.. మండల సర్వేయర్లు విశాఖ జిల్లాలోని నర్సీపట్నం పాడేరు డివిజన్లలో ఎంపిక చేసిన 10మందిని సచివాలయం సర్వేయర్ క్షేత్రస్థాయిలో తర్ఫీదు ఇస్తున్నారు. మీరు శిక్షణ పూర్తి చేసుకుని మిగతా సర్వర్లకు వీటి పై పూర్తి అవగాహన కల్పిస్తారు. నర్సీపట్నం డివిజన్ పరిధిలో 10 మండలాలకు సంబంధించి సుమారు 57 వేల సర్వే నంబర్లోని సుమారు 3.74 లక్షల ఎకరాల భూముల్లో భూ సమాచారం కోసం రీ సర్వేకు ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఇదీ చూడండి. అత్యంత పరిశుభ్రమైన పెద్ద నగరంగా విజయవాడ