విశాఖ జిల్లా తుమ్మపాల చక్కెర కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులకు వారం రోజుల్లో వేతన బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. కర్మాగారంలో 30 మంది పర్మినెంట్, 300 మంది ఎన్ఎంఆర్ కార్మికులు పని చేస్తున్నారని… వీరికి 2018 నుంచి రూ.4కోట్ల వేతన బకాయిలు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ విషయంపై సీఎం జగన్ మోహన్ రెడ్డికి వివరించామని ఈనెల 20న అసెంబ్లీలో ప్రస్తావించగా… సమస్యని పరిష్కరించాలని సంబంధిత మంత్రిని ఆదేశించినట్లు వివరించారు.
మంత్రి కురసాల కన్నబాబుని కలవగా వారం రోజుల్లో వేతన బకాయిలు చెల్లింపు చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. గతంలో కర్మాగారంలో చెరుకు సరఫరా చేసిన రైతులకు బకాయిలు చెల్లించినట్లు వివరించారు.
ఇదీ చూడండి.
ఇంకా అందని బెయిల్ పత్రాలు.. ఎంపీ రఘురామ సోమవారం విడుదలయ్యే అవకాశం!