ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా అరకు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ అన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత తొలిసారిగా అరకులోయ వచ్చిన ఆయనకు వైకాపా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాలుస్తూ గిరిజన సంప్రదాయ నృత్యం చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ గ్రామాల్లోని కనీస సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తాగునీరు, రహదారులు, యువతకు ఉపాధి కార్యక్రమాలు కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పర్యాటక పరంగా అరకు లోయ మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
ఇవీ చదవండి