ETV Bharat / state

ఎస్సై తీరుపై ఎంపీ తీవ్ర ఆగ్రహం - సీఎం జగన్ పుట్టిన రోజు వార్తలు

తాను మాట్లాడుతున్నా ఎస్సై పట్టించుకోకపోవడంపై వైకాపా ఎంపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై.. ఎస్సైకి వ్యతిరేకంగా వైకాపా కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. పోలీస్ అధికారులతో ఎమ్మెల్యే, ఎంపీ చర్చించడంతో సమస్య సద్దుమణిగింది. ఈఘటన విశాఖ జిల్లా హుకుంపేటలో జరిగింది.

Araku MP fire on  Hukumpeta si
ఎస్సైపై ఎంపీ మాధవి తీవ్ర ఆగ్రహం
author img

By

Published : Dec 23, 2020, 8:00 AM IST

హుకుంపేటలో సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు

విశాఖ జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో సోమవారం సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకల్లో నిర్వహించిన కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా అరకు లోయ ఎంపీ మాధవి, ఎమ్మెల్యే పాల్గుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ సరిగాలేదని ఎమ్మెల్యే, ఎంపీ... ఎస్సైను ప్రశ్నించామన్నారు. తమ మాటలను ఎస్సై పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సదరు ఎస్సైను సస్పెండ్ చేయాలంటూ... వైకాపా కార్యకర్తలు, నాయకులు హుకుంపేట పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ఇద్దరూ అక్కడికి చేరుకుని... పోలీస్ అధికారులు చర్చించటంతో వివాదం సద్దుమణిగింది. తాను అన్ని కార్యక్రమాలకు హాజరయ్యానని... వారు ఎందుకు కోపగించుకున్నారో తనకు తెలియదని ఎస్​ఐ చెప్పారు. తన తల్లి కంటి ఆపరేషన్​తో కాస్త దిగాలుగా ఉన్నానని ఎస్సై ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

పోలీసుల అదుపులో మాజీ మావోయిస్టు క్రాంతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.