విశాఖ ఏజెన్సీ పాడేరు ఆర్టీసీ డిపో నుంచి 14 బస్సులు రోడ్లపైకి రానున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో భౌతికదూరం పాటిస్తూ తక్కువ మంది ప్రయాణికులతో బస్సులు నడపనున్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి బస్సుల సేవలు ప్రారంభమవుతాయని డిపో మేనేజర్ నాయుడు తెలిపారు. ప్రస్తుతం ఉన్న బస్సుల్లో ప్రధాన మార్గాలకు మాత్రమే 14 సర్వీసులకు అనుమతిచ్చారు. పాడేరు డిపో నుంచి అరకులోయ-3, చింతపల్లి-3, ముంచంగిపుట్టు-2, విశాఖపట్నం-2, చోడవరం-2, రాజమహేంద్రవరం-1, కాకినాడకు ఒక బస్సు నడపనున్నారు. ప్రయాణికులు టికెట్లను డిపోలో కౌంటర్ వద్ద, మండల కేంద్రాల్లో ప్రత్యేక ఆర్టీసీ కౌంటర్ వద్ద తీసుకోవచ్చు. బస్సులో డ్రైవర్ మాత్రమే ఉంటారు. మధ్యలో ఎక్కడా ప్రయాణికులను ఎక్కించుకోరు.
ఇదీ చదవండి: రేపటి నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం: ఆర్టీసీ ఎండీ