- గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నవ్సారి జిల్లాలో కారు, బస్సు ఢీకొని 10 మంది మృతి చెందారు
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమ ఓట్లపై ఎన్నికల సంఘం మౌనం.. విపక్షాల విమర్శలు
శాసనమండలి పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున బోగస్, డూప్లికేట్ ఓట్లు ఉన్నాయంటూ ఫిర్యాదులు వచ్చినా ఎన్నికల సంఘం వాటిని పూర్తిగా తొలగించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తుది జాబితాలోనూ పెద్దసంఖ్యలో బోగస్ ఓటర్లు కొనసాగుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
- టీడీపీ అన్‌స్టాపబుల్ .. బుల్లెట్లా దూసుకెళ్తాం: చంద్రబాబు
- విశాఖను రాజధాని కాకుంటే.. రాష్ట్రంగా ప్రకటించాలి: మంత్రి ధర్మాన
విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాల్సిందేనని, లేని పక్షంలో కొత్త రాష్ట్రంగానైనా ప్రకటించాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండు చేశారు. శ్రీకాకుళంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. 70 ఏళ్లుగా ఈ ప్రాంతం వెనుకబడే ఉందన్నారు. అమరావతి అనేది కేవలం రియల్ఎస్టేట్ వ్యాపారమని ఆరోపించారు.
- 'ఓటీపీ ఎవరికీ చెప్పకండి.. ఆధార్‌ను ఎక్కడపడితే అక్కడ వదిలేయకండి'.. ప్రజలకు కేంద్రం సూచన
ఆధార్‌కార్డు విషయంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఆధార్‌కార్డు, వాటి కాపీలను ఎక్కడపడితే అక్కడ వదిలేయొద్దని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ప్రజలకు సూచించింది.
- జిన్‌పింగ్‌తో పుతిన్ వీడియో కాన్ఫరెన్స్.. ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం..!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆంతరంగిక చర్చలు చేపట్టారు. రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత దృఢపరచుకొంటామని ఇరువురు శుక్రవారం ప్రకటించారు.
- భారంగా మార్చి.. దూరంగా వెళ్తూ.. కీలక పరిణామాలకు వేదికగా 2022
2022.. ఎంతో 'భారాన్ని' మన మీద మోపి కనుమరుగవుతోంది.పెట్రోలు ధర సెంచరీ కొట్టింది.. వంటనూనె డబుల్ సెంచరీ కొట్టినా మళ్లీ వెనక్కి వచ్చింది. ఆహార పదార్థాలు, నిత్యావసరాలు ప్రియమయ్యాయి. ఆర్బీఐ వరుస వడ్డింపుతో.. నెలవారీ వాయిదాలు మోత మోగుతున్నాయి రూపాయి క్షీణతతో.. విదేశీ చదువులు, ప్రయాణాలు భారమయ్యాయి. దిగ్గజ వ్యాపారవేత్తల మరణాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- 2022లో భారత క్రీడారంగంలో మెరుపులు.. మలుపులు.. ఇవే
2022 భారత క్రీడా అభిమానులకు మిశ్రమ అనుభూతులను అందించింది. చరిత్రలో నిలిచిపోయే విజయాలు కొన్ని.. మర్చిపోవాల్సిన పరాజయాలు మరికొన్ని. అత్యుత్తమ ఆటతీరుతో సత్తాచాటింది కొందరైతే.. ఊరించి ఉసూరుమనిపించింది మరికొందరు. మరి.. ఈ ఏడాది భారత క్రీడా రంగంలో ప్రధాన పరిణామాలను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుందాం.
- నానితో జతకట్టనున్న మృణాల్.. రిపబ్లిక్ డేకి వస్తున్న 'హంట్'
కొత్త ఏడాది ప్రారంభమైతే చాలు సినీ ప్రియులకు పండుగే. ఎందుకంటే పెద్ద హీరో నుంచి చిన్న హీరో వరకు అందరూ.. ఏదో ఒక కొత్త అప్డేట్తో ముందుకు వస్తుంటారు. అయితే, కొత్త ఏడాది ప్రారంభంలో హీరో నాని తన కొత్త సినిమాను ప్రకటించనున్నారు. 2023లో నానితో పాటుగా.. హీరో సుధీర్‌బాబు, అశ్విన్‌బాబు వంటి చిన్న హీరోలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తమిళ అనువాద చిత్రాలు, ద్విభాషా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన తమిళ కథానాయకుడు శివకార్తికేయన్ కూడా తెలుగులో ఓ చిత్రాన్ని చేస్తున్నట్లు సమాచారం.