కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు విశాఖలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నిరసన వ్యక్తం చేసింది. మధ్యాహ్న భోజన సమయంలో ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని సీపీఎస్ విధానాన్ని రద్దు పరిచి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని నియామకాలపై నిషేధాలను తొలగించాలని అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణను నిలిపివేయాలని కార్మిక చట్ట సవరణ లను రద్దు చేయాలని పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరారు.
ఇదీ చదవండి: దేశంలో తగ్గిన కేసులు.. కొత్తగా 70,589 మందికి కరోనా