విశాఖ జిల్లా దేవరాపల్లిలో అంగన్వాడీ టీచర్ వి.రాములమ్మ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనంతగిరి మండలం కొరపర్తి గ్రామంలో రాములమ్మ అంగన్ వాడీ టీచర్ గా పని చేశారు. ఆమె కుటుంబ సభ్యులతో స్థానికంగా నివాసముండేవారు. ఐదేళ్లుగా గుండె, కడుపులో నొప్పితో బాధపడుతున్నారు.
వాటిని భరించలేని ఆమె బెడ్రూంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్లు చెప్పారు. ఆమె భర్త అరకు లోయలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారని, ముగ్గురు పిల్లలున్నట్లు తెలిపారు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించామన్నారు.
ఇదీ చదవండి: