ETV Bharat / state

ఎన్నో ఏళ్ల ఆదర్శం... ఇప్పటికీ నవతేజం - ఆంధ్రా యూనివర్సిటీ

() 93ఏళ్ల అద్భుత చరిత్ర... దేశానికి, ప్రపంచానికి పెద్ద సంఖ్యలో మేధావుల్ని అందించింది ఆంధ్ర విశ్వవిద్యాలయం. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో... దేశం సాధించిన పురోగతిలో ఏయూ భాగస్వామ్యం వెలకట్టలేనిది. భావితరాల బంగారు భవిత కోసం... సమున్నత లక్ష్యాలతో ముందుకెళుతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం... మరో వ్యవస్థాపక దినోత్సవం జరుపుకునేందుకు సిద్ధమైంది.

ఆంధ్రా యూనివర్సిటీ
author img

By

Published : Apr 25, 2019, 6:15 PM IST

94 ఏళ్ల చరిత్ర

తెలుగు మాట్లాడే వారికి ఓ విశ్వవిద్యాలయం ఉండాలనే లక్ష్యం నుంచి ఆవిర్భవించినదే ఆంధ్ర విశ్వవిద్యాలయం. కట్టమంచి రామలింగారెడ్డి పోరాట ఫలితంగా ఏర్పడిన ఏయూ... ఆయన నేతృత్వంలోనే తొలి అడుగులు ప్రారంభించింది. కట్టమంచి రామలింగా రెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణ వంటి మహోన్నత వ్యక్తుల సారథ్యంలో... దేశానికి దశా దిశ చూపించే ఎంతో మందిని అందించింది. 1926 ఏప్రిల్ 26న ఆవిర్భవించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎప్పటికప్పుడు నూతన ఉత్సాహంతో పరుగులు తీస్తోంది. ఇప్పుడు మరో వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోనుంది.

ఆసియాలో ఎంబీఏ పుట్టింది ఇక్కడే
దేశ భవిష్యత్తు అవసరాలకు అనుగుణమైన కోర్సులు అందించడంలో ఏయూ ఎప్పుడూ ముందంజలోనే ఉంటోంది. ఆసియాలో మొట్టమొదటిగా ఎంబీఏ కోర్సు ఇక్కడే ప్రారంభమైంది. న్యూక్లియర్ ఫిజిక్స్, న్యూక్లియర్ కెమిస్ట్రీ, మెరైన్ ఇంజినీరింగ్, మెటీరియాలజీ అండ్ ఓషియనోగ్రఫీ వంటి కోర్సులను దేశానికి అందించిన ఘనత ఏయూకే దక్కింది. ప్రారంభకాలం నుంచి నేటి వరకు వైవిధ్యాన్ని ఎప్పుడూ విడిచి పెట్టలేదు. ప్రస్తుతం దేశంలోనే ఏ వర్సిటీ చేపట్టని విధంగా... ఏయూ రక్షణ శాఖ అవసరాలకు అనుగుణంగా కోర్సులు రూపొందించడమే కాదు... ఆచరణలో వాటిని అందిస్తూ ప్రత్యేకత చాటుకుంటోంది. నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీకి సంబంధించిన వివిధ కోర్సులు అందిస్తూ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించింది.

అగ్రస్థానం దిశగా అడుగులు
భవిష్యత్తులో మరింత ఉన్నతస్థాయిని చేరుకునే లక్ష్యంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం పయనిస్తోందని ఉపకులపతి చెబుతున్నారు. దేశంలోనే అత్యుత్తమ వర్సిటీల జాబితాలో మొదటి స్థానాన్ని సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించారు. అత్యంత పటిష్ఠమైన పూర్వవిద్యార్థుల సంఘం కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం... వారి సహకారంతో మరింత బలోపేతంగా మారనుంది.

Intro:సత్యసాయి ఆరాధానోత్సవం వాడవాడలా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి లో రోటరీ నగర్, కండ్రవీధి, చేరివీధి లోని సత్య సాయి మందిరాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. నగర సంకీర్తన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

Body:టెక్కలి

Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.