సెప్టెంబర్ 29న ఆంధ్ర, తెలంగాణ మన్యం బంద్కు గిరిజన సంక్షేమ సంఘం, గిరిజన ఉద్యోగుల సంఘం పిలుపునిచ్చింది. షెడ్యూల్డ్ ఏరియాలో ఆదివాసీలకే వంద శాతం రిజర్వేషన్లు కల్పించాలని సంఘం ప్రధాన కార్యదర్శి అప్పలనర్సు డిమాండ్ చేశారు. గిరిజన రిజర్వేషన్లకు చట్టబద్ధత కోసం రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. అనంతరం 9వ షెడ్యూల్లో చేరుస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని స్పష్టం చేశారు.
ప్రత్యేక డీఎస్సీ కావాలి..
రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని అప్పలనర్స డిమాండ్ చేశారు. నాన్ షెడ్యూల్డ్ గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్లో చేర్చాలన్నారు. పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించాలని కోరారు.