అమరావతి రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు సత్యవతి అన్నారు. కుసర్లపూడిలో నూతనంగా నిర్మించిన మరిడిమాంబ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి జగన్ పరిపాలన దేశంలోని విమర్శకుల ప్రశంసలు పొందిందని ఎంపీ అన్నారు. పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని.. అందుకే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టంచేశారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడం వలన ఉత్తరాంధ్ర, రాయలసీమ తదితర ప్రాంతాలకు న్యాయం జరుగుతుందన్నారు. అమరావతిని వ్యవసాయపరంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. కొంతమంది రాజకీయ నాయకులు అమరావతి రైతులను స్వలాభం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. రైతన్నలు వారి వలలో పడొద్దని సూచించారు.
ఇవీ చదవండి...