విశాఖపట్నం నుంచి పాడేరుకు అంబులెన్స్‌లో నలుగురు ప్రయాణీకులను డ్రైవర్ రవికుమార్ తరలించారు. విషయం తెలుసుకున్న పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డీకే బాలాజీ అంబులెన్స్ డ్రైవర్‌ను విధులు నుంచి తొలగించారు. నలుగురిని పాడేరు క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. నిబంధనలు అతిక్రమించి అత్యవసర వాహనంలో ప్రయాణీకులను తరలించడం నేరమని అధికారులు హెచ్చరించారు.
ఇదీ చూడండి:పోలీసుల దాతృత్వం... విశాఖ ఏజెన్సీలో నిత్యావసరాలు పంపిణీ