పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ విశాఖ జిల్లాలోని సీతమ్మధార కూడలిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వామన మూర్తి మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్పై వేసిన సుంకాలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుతున్న సందర్భంలో... పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యులు కేంద్రప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి పెట్రో ఉత్పత్తుల ధరలను తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రావికృష్ణ, అప్పలరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన - aituc latest news vishakapatnam
కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ విశాఖలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు.